హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు మంత్రి తలసాని. వినాయకుడి ఆశీస్సులతో త్వరగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటారని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అపోలోలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ పరిస్థితిపై వైద్యులతో మాట్లాడానని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు తలసాని అన్నారు.
ఇక ప్రస్తుతం తేజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలను చేయనున్నారు. రేపు మరో హెల్త్ బులెటిన్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికీ తేజ్ కు యాక్సిడెంట్ జరగడంతో కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.