కరోనా ప్రభావం అన్ని రంగాల మీద చూపిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో షూటింగ్ లు వాయిదా పడ్డాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఆగిపోయాయి. ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత షూటింగ్ లు మొదలు కానున్నాయి. కానీ ధియేటర్ల పరిస్థితి ఏంటి అన్నది అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఇదే విషయమై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో మరో 3 నుంచి 4 నెలల పాటు థియేటర్స్ తెరిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్స్ కూడా అనుమతించబోమని పేర్కొన్నారు.దీనితో విడుదలకు సిద్ధం అయిన సినిమాలు, షూటింగ్ దశలో ఉన్న సినీ నిర్మాతలు తలలు పట్టుకుని కూర్చున్నారు.