గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని. తన మాటలు ఒకవేళ తప్పుగా అనిపిస్తే.. గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నుంచి ఎవరూ గంగపుత్రులను పట్టించుకోలేదని..టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే వారి సంక్షేమం గురించి ఆలోచించినట్టు తెలిపారు. గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉండేవారని తలసాని అన్నారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవించే గంగపుత్రులు, బెస్త, ముదిరాజ్‌లకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తుంటారని చెప్పుకొచ్చారు.
కోకాపేటలో ఇటీవల జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను ఉద్దేశించి తలసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని అఖిల భారత గంగపుత్ర సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది.