[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/05/talasani.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని సవాల్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. దేశవ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మనగర్ లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు తలసాని. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని ఇష్టారీతిన బీజేపీ నేతలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.
ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని.. అమిత్ షా వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు తలసాని. పేదల కలను ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. కరోనా కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందని తెలిపారు. బీజేపీ నేతలు కళ్ళుండి చూడలేని కాబోదులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవులు అన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న షా.. మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు తలసాని. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం.. ఎవర్ని గెలిపిస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గుజరాత్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని.. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ఇక ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణలో ఏం పీకడానికి వచ్చారని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని అడిగారు. తాము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుంటే.. కేంద్రం దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు దోచి పెడుతోందని ఆరోపించారు.