అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవన కూల్చివేత పనులు మంత్రి పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. కూల్చివేత పూర్తయ్యే వరకు పరిసర ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. నగరంలో అనుమతి లేని భవనాలు, జనావాసాల మధ్య ఉన్న గోదాముల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇటీవల డెక్కన్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు రోజుల సమయం పట్టింది. అగ్నికి ఆహుతైన భవనాన్ని గురువారం (జనవరి 20) రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు.