షూటింగ్స్ పై చిరు ఇంట్లో పెద్దల సమావేశం - Tolivelugu

షూటింగ్స్ పై చిరు ఇంట్లో పెద్దల సమావేశం

లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ మూగబోయింది. షూటింగ్ లు నిలిచిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో విమానాలు, బస్సు లు, ట్రైన్ లు తిరుగుతున్నాయి. కానీ సినిమా షూటింగ్ లకు మాత్రం పర్మిషన్ రాలేదు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. దీనితో సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్ లకు కూడా పర్మిషన్ ఇవ్వాలన్న డిమాండ్ పై మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మీటింగ్ పెట్టారు.

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చిరు ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ అనుమతి ఇవ్వడంతో.. టాలీవుడ్‌ పరిస్థితేంటి అనేదానిపై గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలోని పెద్దలు చర్చించుకుని ప్రభుత్వాన్ని సంప్రదించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే చిరు ఇంట్లో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లపై చర్చిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp