తెలంగాణలో అధికార పార్టీ నేతలే కాదు.. వారి అనుచరులు, వారి దగ్గర పనిచేసేవారు కూడా బరితెగిస్తున్నారు. తామేం చేసినా వారు అండగా ఉంటారనో ధైర్యంతో.. ఎంతకైనా దిగజారిపోతున్నారు. తాజాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పీఆర్వో.. తోట శ్రీకాంత్ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. సొంత భార్యపైనే దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎదులాపూర్ గ్రామంలో తన భార్య కోమలపై ఇలా తెగించాడు తోట శ్రీకాంత్. అందరూ చూస్తుండగానే విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడని తాజాగా ఆమె మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అది తట్టుకోలేని శ్రీకాంత్. ఎక్కడికి వెళ్తావు.. ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా నన్ను ఎవరు ఏం చేయలేరు.. మంత్రి నాకు అండగా ఉన్నాడు.. అంటూ భార్యపై ఇలా రెచ్చిపోయాడు. దీంతో ఈ సంఘటనను చూసినవారంతా శ్రీకాంత్‌పై మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను పీఆర్వోలుగా పెట్టుకుని మంత్రి.. ఏం సందేశం ఇస్తున్నారని. ప్రశ్నిస్తున్నారు. వెంటనే అతన్ని విధుల్లో నుంచి తొలగించి… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.