ఉన్నది లేనిది కలిపి రాష్ట్ర ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారుని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఆకర్షితులు అయితున్నని అన్నారు. అది ఓర్వ లేని ప్రతిపక్షాలు లేనిపోని నిందలేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం చేయడం సరికాదన్నారు. నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని.. లక్ష 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో 19 వేలు, బీహార్ లో 8.950, కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారని.. కానీ తెలంగాణలో 40 వేల ఉద్యోగాలు కల్పించామని అన్నారు.
కాదని అబద్దాలు మాట్లాడే బీజేపీ నేతలకు సవాల్.. అబద్ధమైతే నేను రాజీనామా చేస్తా.. నిజమయితే మీరు మీ పదవులకు రాజీనామా చేస్తారా..? అంటూ మంత్రి సవాల్ విసిరారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఏడేళ్లలో కొత్తగా 17 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు. 13 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రైవేట్ లో ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు.
గతంలో ఐటీ ఎగుమతులు రూ. 50 వేల కోట్లు ఉంటే.. నేడు రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. గత గత ప్రభుత్వాల పాలనలో ఎప్పుడైనా ఇలా ఉన్నాయా..? అని నిలదీశారు. దీనిపై ఎలాంటి సవాలుకైనా నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు మంత్రి వేముల. మీరు అన్ని ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన నెటిజన్లు.