కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్ అంటే వార్ వన్ సైడ్ జరగాల్సిందే. గులాబీ బాస్ గంటల కొద్ది మాట్లాడుతుంటే మంత్రులు తలలు ఊపడం తప్ప నోరెత్తి మాట్లాడేది ఉండదు. అలాంటిది రెండు రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో మంత్రులు ధరణి అంశాన్ని ఎజెండాగా తీసుకొని తమ గళాన్ని వినిపించారు అని తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా డజను మంది మంత్రులు ధరణి అంత చెత్త సాప్ట్ వేర్ ఇంకొకటి లేదు. అంతా తప్పుల తడిక. తప్పులను సరిదిద్దే అవకాశం కూడా లేదు. దీనిపై కలెక్టర్ లు కూడా చేతులు ఎత్తేశారు. ధరణి మన కొంప ముంచుతుంది. అంటు వరుసపెట్టి ధరణి పోర్టల్ గురించి తమ అసంతృప్తిని వెళ్లగక్కారని తెలుస్తొంది.
ఎన్నడూ మాట్లాడని మంత్రులు ఒక్కసారిగా కేబినెట్ సమావేశంలో స్వరం విప్పడమే కాకుండా వాయిస్ పెంచి మాట్లాడుతుంటే కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యింది అని సమచారం. హుజూరాబాద్ ఓటమి తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలలో ధైర్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా మనం మౌనంగా ఉంటే కుదరదని.. క్షేత్రం స్థాయిలో జరుగుతున్న విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని గులాబీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తొంది. అందులో భాగమే మంత్రివర్గ సమావేశంలో తమ గళం విప్పారని చెబుతున్నారు.
ధరణి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రెవెన్యూ రికార్డ్స్ ను ధరణికి ఎక్కించాం. ఈ విషయంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందంటూ సమయం దొరికినప్పుడల్లా ఊదరగొట్టిన కేసీఆర్ కు.. మంత్రుల వాదన విన్న తరువాత ఏంచేయాలో అర్థం కాలేదు అంటున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన సాప్ట్ వేర్ కంపెనీ వారికే ధరణి బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కంపెనీకి బాధ్యతలు ఇవ్వడంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారయనే ఆరోపణ కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ధరణిని సరిచేయడం సాధ్యం కాదని దానిని రద్దు చేసి పాత వ్యవస్థనే మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని రెవెన్యూ రంగ నిపుణులు అంటున్నారు.
కేసీఆర్ ఒక పథకం ప్రకారం రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేశాడని కూడా వారు లోలోపల చర్చించుకుంటున్నారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి.. సీసీఎల్ఆర్ ను భ్రష్టు పట్టించాడని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత పత్రికలో ఒక సంవత్సరం పాటు రెవెన్యూ వ్యవస్థపై తప్పుడు వార్త కథనాలు రాయించి.. తరువాత ముఖ్యమైన రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసాడు అని అంటున్నారు. రెవెన్యూ శాఖను తన దగ్గరనే పెట్టుకొని కావలనే ఈ పనిచేసాడని ఇదంతా దొరల భూములను కాపాడడం కోసం ప్రభుత్వ భూములను కొట్టేయడానికి చేసిందే అని కూడా వార్తలు విపిస్తున్నాయి. మొత్తానికి భవిష్యత్ లో ధరణి గొప్పది అని కేసీఆర్ అనకుండా మంత్రులు చేయగలిగారు అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.