మండలి మాజీ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి బలమైన ఎదురుదెబ్బ తగిలిందా…? మంత్రి జగదీష్ రెడ్డికి స్కెచ్ కు గుత్తా బలయ్యారా…? తన కనుసైగల్లో నడిచే నార్మక్ డెయిరీ ఇప్పుడు చేజారటంలో మంత్రిదే కీలక పాత్రా…?
నార్మక్ డెయిరీ అంటే గుత్తా బ్రదర్స్… గుత్తా బ్రదర్స్ అంటే నార్మక్ డెయిరీ అన్నట్లుగా నల్గొండలో రాజకీయం నడుస్తుంది. డెయిరీ అంతా గుత్తా సోదరుడు జితేందర్ రెడ్డి చూస్తుంటారు. గుత్తా ఏ పార్టీలో ఉన్నా ఈ సంస్థ చైర్మన్ గిరి వారికి దక్కాల్సిందే. కానీ ఈసారి అధికార పార్టీలో ఉన్నప్పటికీ పదవి రాదని తేలిపోయింది.
మంత్రి జగదీష్ రెడ్డి అధిష్టానం వద్ద చక్రం తిప్పటంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. తన వర్గంగా ముద్రపడ్డ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత వర్గానికి ఈ పదవి ఇప్పించుకోవటంలో ఆయన సక్సెస్ అయినట్లు సమాచారం. అధిష్టానం నో చెప్పటంతోనే నార్మక్ డెయిరీ చైర్మన్ పదవి ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని గుత్తా జితేందర్ రెడ్డి ప్రకటించారు.
త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉన్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి రెన్యూవల్ చేస్తారని ఆశిస్తున్నారు. గతంలో మంత్రి పదవి హామీతో టీఆర్ఎస్ లో చేరినా ఆయనకు పదవి దక్కలేదు. ఇప్పుడు ఎంతో కాలంగా తమ చేతుల్లో ఉన్న చైర్మన్ గిరి కూడా పోయింది. మరీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా… అది కూడా హ్యాండ్ ఇస్తారా చూడాలి.