న్యాయం కావాలని ప్రధాని మోడీని కోరుతూ.. అసోంకు చెందిన నాలుగేళ్ల బాలుడు చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడు.. 11 మంది దుండగులు తన తండ్రిని కిరాతకంగా చంపేశారని చెమర్చిన కళ్లతో చెప్పిన చిన్నారి.. తనకు న్యాయం చేయాలని కోరాడు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ.. విజ్ఞప్తి చేశాడు.
తన పేరు రిజ్వాన్ సాహిద్ అని, 2016 డిసెంబర్ 26న సిల్చార్‌లోని సోనాయ్ రోడ్‌లో తన తండ్రిని చంపేశారని వివరించాడు. ఐ వాంట్ జస్టిస్ అనే వాక్యంతో కూడి ప్లకార్డును పట్టుకుని.. తన సమస్యను వివరించాడు. హంతకులను పట్టుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. బాలుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
I want justice.@PMOIndia @HMOIndia @himantabiswa @cacharpolice @TheQuint pic.twitter.com/Cm0DeVw8TD
— Rizwan Sahid Laskar (@sahid_rizwan) September 13, 2021
Advertisements