తల్లిదండ్రులు మందలిస్తే పిల్లలు అలగడం చూసినం.. ఇంకొంతమంది ఇంటి నుండి పారిపోవడం చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఓ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
నగరానికి చెందిన ధనుంజయ్ అనే 17 సంవత్సరాల కుర్రాడ్ని ఓ విషయమై కొద్దిరోజుల క్రితం తండ్రి మందలించాడు. దీంతో కోపంతో గోడకు కొట్టే మేకులను మింగేశాడు. అప్పటి నుండి కడుపులో నొప్పి మొదలైంది. రోజురోజుకు నొప్పి తీవ్రం కావడంతో తండ్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. మందులు వాడినా తగ్గలేదు. చివరగా డాక్టర్లు ఆల్ట్రా స్కానింగ్ తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. కడుపులో ఇనుప మేకులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేసిన డాక్టర్లు 21 మేకులను కడుపులో నుంచి బయటికి తీశారు. ప్రాణహాని ఏమీ లేనట్టు వెల్లడించారు.