మహిళలపై రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినప్పటికీ మానవమృగాలు మహిళలపై విరుచుకుపడుతూనే ఉన్నాయి.
తాజాగా.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చారు దుండగులు. ఈ దారుణ ఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బాలిక బయటకు వెళ్లిందని మృతురాలి తల్లి తెలిపింది. ఎంతకీ కూతురు ఇంటికి రాకపోవడంతో కంగారు పడి వెతకగా ఊరి చివర ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉందని కన్నీరు పెట్టుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Advertisements
అయితే.. గ్రామానికి చెందిన నాని అనే యువకుడితో బాలిక ప్రేమలో ఉందని పోలీసులకు తెలిసింది. ఆ కోణంలో కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.