దేశంలో ప్రజలందరూ కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో రోడ్డు మీద యాక్సిడెంట్లు తగ్గాయి. క్రైమ్ రేట్ తగ్గింది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఓ గ్రామంలో నివసించే బాలికపై చిన్నాన్న కొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మే 13 వతేదీన జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పనికి వెళ్లగా కాచుకు కూర్చున్న చిన్నాన్న కొడుకు పరమేశు బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అయితే తండ్రి ఇంటికి వచ్చిన తరువాత బాలిక జరిగిన విషయం చెప్పగా, తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.