మైనర్ విద్యార్థినిని మభ్యపెట్టి ఒకరు అత్యాచారం చేయగా, సెల్ ఫోన్ లో చిత్రాలు ఉన్నాయంటూ మరో యువకుడు బెదిరించి లోబర్చుకునేయత్నం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. నిందితులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బందువులని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం లో ఈ ఘటన జరిగింది. అభం శుభం తెలియని మైనర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మభ్యపెట్టి ఒకరు అత్యాచారం చేయగా, బ్లాక్ మెయిలింగ్ తో మరొకరు ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేశారు. ఇద్దరు నిందితులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బందువులు. నిందితుల బ్లాక్ మెయిలింగ్ కు బయపడిన విద్యార్థిని తనలో తానే కుమిలిపోయింది. కూతురి ని బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అడగటంతో భయంతో వణికిపోయింది. విషయాన్ని తల్లితండ్రులకు తెలిపింది. నిందితులు అమ్మాయితో ఉన్న అభ్యంతకర ఫోటోలతో ఒకరి నుండి మరొకరు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిపింది. తల్లితండ్రులతో కలిసి చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితుల పై ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు.