అందంగా కనిపించాలని చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దొరికిన క్రీమ్ లు రాస్తుంటారు. మహిళలు మాత్రం తమ జుట్టును అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్ లో దొరికే అన్నిరకాల తైలాలను, షాంపూలను అధిక ధరలను పెట్టి కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. కానీ.. వాటి ఫలితం మాత్రం అంత ఎక్కువగా ఉండదు.
కానీ.. తక్కువ ధరలో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి.. వంటింట్లో ఉపయోగించే పుదీనాను వాడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. జుట్టుకు కావల్సిన బలాన్ని, మంచి రంగును ఇవ్వడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. పుదీనాను ఉపయోగించి జుట్టు సమస్యలను పరిష్కరించవచ్చని చెప్తున్నారు.
పుదీనా ఆకులతోపాటు.. పుదీనా తైలాన్ని ఉపయోగించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు. పుదీనా ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయంటున్నారు. పుదీనా ఆకులు తలలో చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అంటున్నారు నిపుణులు. పుదీనా యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుందిని.. దీనిని ఉపయోగించడం వల్ల ఒత్తిడితోపాటు తలలో వచ్చే దురదలు కూడా తగ్గుతాయంటున్నారు.
పుదీనా జుట్టు పెరుగుదలను కూడా బాగా ప్రోత్సహిస్తుందని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేయాలని.. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పొడి బారడం తగ్గి కాంతివంతంగా తయారవుతుందని వివరించారు.
అంతేకాకుండా.. చుండ్రు, దురదలు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా తయారవుతోందని చెప్తున్నారు. 5 లేదా 6 చుక్కల పుదీనా నూనెలో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కానీ ఆముదం నూనెను కానీ.. కలిపి వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. పుదీనా నూనెలో నిమ్మరసాన్ని కలిపి రాసుకోవడం వల్ల తలలో వచ్చే దురదలు తగ్గుతాయంటున్నారు. ఈ విధంగా పుదీనా ఆకులను, పుదీనా నూనెను ఉపయోగించడం ద్వారా జుట్టు సమస్యలన్నింటినీ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చుతోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.