టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రాక్టీస్ చేసేందుకు రోజూ ఇంఫాల్ లోని స్టేడియానికి వెళ్లేందుకు లిఫ్ట్ ఇచ్చిన లారీ డ్రైవర్లను వెతికి మరీ… మణిపూర్ లోని ఇంటికి పిలిపించింది. ఘనంగా సన్మానించి కానుకలు ఇచ్చి గౌరవించింది.
మీరాబాయి ఇంటికి.. ఇంఫాల్ స్టేడియం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డబ్బులు లేక బస్సులో వెళ్లని పరిస్థితి. ఆమె వెళ్లే సమయంలో ఇసుక లోడుతో లారీలు వెళ్తుండేవి. ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడి స్టేడియానికి చేరుకునేది మీరాబాయి.
తనను లారీ డ్రైవర్లు రోజూ ఉచితంగా ఇంఫాల్ కు తీసుకెళ్లేవారని.. వారు చేసిన సాయం.. ఒలింపిక్స్ లో పతకం సాధించేందుకు ఉపయోగ పడిందన్నారు మీరాబాయి. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.