తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతిరావుకు మరోసారి నల్గొండ 8వ అదనపు న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ బెయిల్ మంజూరు చేశారు. కిరాయి రౌడీలతో తన కూతురు అమృత ప్రణయ్ అనే వ్యక్తిని కులాంతర వివాహాం చేసుకందని హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మారుతీ రావు ను పోలీస్ అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. నెల రోజులు క్రితం మారుతీ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ పై బయటకు వచ్చిన మారుతీరావు ఇటీవల కూతురు అమృతను మనుషులను పంపి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. ఇదే విషయం పై అమృత మరో మారు పోలీసులను ఆశ్రయించింది. దీంతో మారుతీరావును పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో మారుతీరావు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 20 వేల షూరిటీ, రెండు నెలల పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పోలీసు స్టేషన్ కు హాజరై సంతకం చేయాలని షరతులు విధించి, మరోమారు ఇటువంటి బెదిరింపులు చేయరాదని హెచ్చరిస్తూ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.