కరోనా మహమ్మారి కారణంగా మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడ్డాయి. పోటీదారులతో పాటు నిర్వాహణ సిబ్బంది మొత్తం 17 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో, ప్రపంచ సుందరి పోటీలు వాయిదా పడ్డాయి. ఈ పోటీల్లో భారత్ తరుపున ప్రాతినిత్యం వహిస్తున్న మిస్ ఇండియా 2020 మానస వారణాసి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. డిసెంబర్ 16న ప్యూర్టోరికోలో జరగాల్సిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మరో 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ చేస్తామని ప్రకటించారు.
23 ఏళ్ల మానస వారణాసి మిస్ ఇండియా కిరీటాన్ని 2020లో దక్కించుకుంది. దీంతో, 70వ ప్రపంచ సుందరి పోటీల్లో ఆమెకు భారత్ తరపున పోటీ చేసే అవకాశం లభించింది. ఇంతలోనే ఆమెతో పాటు 17 మంది కరోనా బారిన పడి ఈ పోటీలు వాయిదా పడ్డాయి.