ఛత్తీస్ ఘడ్ లో కాల్పుల కలకలం రేగింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యి…ఒక జవాన్ మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా ఊసూరు నుండి బీజాపూర్ కు బస్ లో CRPF 229 బెటాలియన్ కు చెందిన జవాన్లు వెళ్తున్నారు.
అయితే అందులో ఒక జవాన్ కి చెందిన తుపాకి మిస్ ఫైర్ అయ్యి మరో జవాన్ తలకి బులెట్ తగిలింది. దీనితో అక్కడికక్కడే జవాన్ మృతి చెందారు. మృతి చెందిన జవాన్ త్రి లోక్ సింగ్ హర్యానాకు చెందినవాడట.