మానుషి చిల్లర్.. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమౌతోంది. సహజంగా ఇలా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు ఎవరైనా, తమ తొలి హీరోనే హాట్ ఫేవరెట్ అని చెబుతారు. కానీ మానుషి ఛిల్లర్ మాత్రం తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అంటోంది.
రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసింది మానుషి. అందులో చరణ్ తనను బాగా ఎట్రాక్ట్ చేశాడని చెబుతోంది. చరణ్ కు పెళ్లవ్వడంతో తను చాలా బాధపడ్డానని, ఒకవేళ బ్యాచిలర్ అయి ఉంటే వెళ్లి డేటింగ్ చేద్దామని ప్రపోజ్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ లో చరణ్ పాత్ర తనకు బాగా నచ్చిందని, అతడు ది బెస్ట్ అని అంటోంది.
చూస్తుంటే.. మానుషి సౌత్ పై కూడా కన్నేసినట్టుంది. మంచి అవకాశాలు వస్తే సౌత్ లో కూడా సినిమాలు చేసే ఉద్దేశంలో ఈ బ్యూటీ ఉన్నట్టుంది. అందులో భాగంగానే చరణ్ ను ప్రశంసలతో ముంచెత్తినట్టు కనిపిస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ లో చరణ్ కు క్రేజ్ పెరిగిన మాట వాస్తవం.
ఇక మానుషి విషయానికొస్తే.. 2017 మిస్ వరల్డ్ గా అవతరించినప్పట్నుంచి ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ తర్వాత ఆమె బికినీ ఫొటోస్ కూడా యమ పాపులర్ అయ్యాయి. వీటికి తోడు ఆమె శాకాహారి కావడంతో పెటా ఎక్కువగా ప్రమోట్ చేసింది. తను వెజిటేరియన్ గా మారలేదని, పుట్టుక నుంచే శాకాహారినని అంటోంది ఈ అందాల పిల్ల.