ఆంధ్రప్రదేశ్ కు జవాద్ తుఫాన్ ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరం నుంచి ఈ తుఫాన్ దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా రెండు వందల కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు మొదట తెలిపారు.
ఆ తర్వాత ఉత్తర కోస్తా తీరానికి దగ్గరగా వచ్చి తుఫాన్ దిశ మార్చుకుందని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సా వైపు జవాద్ మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.