జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిషన్ భగీరథ పైపు లైన్ పగిలిపోయి నీళ్లన్నీ లోపలికి వచ్చాయి. నీళ్లన్నీ కాలువలా ప్రవహిస్తూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలన్నీ పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ లో కొట్టుకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చేతికొచ్చినాక ఇలా జరగడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రైతులకు నష్టపరిహారం ఎవరు ఇస్తారు.?మిషిన్ భగీరథ వాళ్ళ..? మార్కెటింగ్ శాఖ వాళ్లా…?