‘అత్తారింటికి దారేది’ పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ చిత్రంలోని సెంటిమెంట్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలోని క్లైమాక్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది.
ఆ సన్నివేశంలో పవన్ కల్యాణ్ తనలోని నటుడిని పూర్తిగా చూపించారు. అత్తను ఇంటికి రమ్మని చెప్పే డైలాగ్స్ కి ఆడియెన్స్ ముగ్ధులయిపోయారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో చాలా లాజిక్ లు ఉంటాయి. అయితే ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఒక లాజిక్ ను మిస్ అయ్యారు. మరి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో పవన్ ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడు కమెడియన్ అలీ వచ్చి పవన్ కి సిగరెట్ తీసుకురమ్మని చెప్తాడు. అలీ పవన్ కళ్యాణ్ ను అప్పటి దాకా కార్ డ్రైవర్ అనుకుంటాడు. దాంతో ఫ్రస్టేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అలీని కొట్టడం జరుగుతుంది. ఆ తరవాత పవన్ కి పాపం అనిపించడంతో అలిని పిలిచి డబ్బులు ఇస్తాడు.
ఒక సూట్కేస్ ను అలీ చేతికి ఇచ్చి, ఇందులో ఎంత డబ్బు ఉందో తెలియదని, తీసుకుపోమమని చెబుతాడు. అయితే ఎంఎస్ నారాయణ ఆ సూట్కేస్ ను తెరచి పవన్ కు ఇస్తాడు.
ఆయన దానిని పూర్తిగా తెరవకుండానే, అలీకి కి ఇస్తాడు. అందులో లాక్ ను తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అలీ సూట్కేస్ తీసుకెళ్లి, తాళం ఇవ్వలేదని వచ్చి అడుగుతాడు.
అప్పుడు పవన్ కళ్యాణ్ అంతకుముందే తెరిచి ఉన్న సూట్కేస్ ను తీసుకొని సుత్తితో పగలగొట్టి, ఓపెన్ చేసి ఒక కట్టను మాత్రమే అలీ చేతిలో పెడతాడు. ఈ సీన్ చూసినవారు ఓపెన్ చేసి ఉన్న సూట్కేస్ ను పగలగొట్టడం ఎందుకు? ఇదేం లాజిక్ అంటూ త్రివిక్రమ్ ను ట్రోల్ చేస్తున్నారు.
Also Read: ప్రేమికుడు మూవీని గవర్నర్ చెన్నారెడ్డి ఎందుకు ఆపాలనుకున్నారు..!?