అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కించిన లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కొత్తబంగారులోకం అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ అద్భుతంగా నటించారు.మిక్కిీ జె. మేయర్ అద్భుత సంగీతంతో సినిమాకి ప్రాణం పోసారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ సినీప్రియులకు చక్కిలిగిలిపెట్టాయి.
‘నీ ప్రశ్నలు నీవే…ఎవ్వరు బదులివ్వరుగా’ అనే సిరివెన్నల పాట ప్రీక్లైమాక్స్ ని పతాక స్థాయికి చేర్చింది. తల్లిందండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు. పిల్లలు తమ కెరీర్ ని పణంగా పెట్టి ప్రేమ మైకంలో తూగడం. వాటి పర్యవసానం. ఇత్యాది విషయాలు ఇతి వృత్తంగా తీసిన ఈ చిత్రం… యూత్ కి ఓ లెసనై ఆలోచింపజేసింది.
Also Read: ఆర్‌ఆర్‌ఆర్ అకౌంట్లో మరో రెండు!!
ఇక ఈ చిత్రం ద్వారా తొలిపరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ చేసిన అల్లరి చేష్టలు యువతని చాలా ఇపాక్ట్ కు గురి చేసింది. తర్వాత ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి. కాస్త అమాయకత్వం,కాస్త గడుసుదనం, ఇంకాస్త కుర్రతనం కలగలిసిన నటిన అందరినీ మెప్పించింది. వరుణ్ సందేశ్ కూడా తన దైన నటనతో హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే కొత్త బంగారులోకం సినిమాలో పెద్ద మిస్టేక్ ఉంది. ఎప్పుడైనా మీరు గమనించారా లేదో ?! కొత్త బంగారు లోకం సినిమాలో హీరో పేరు బాలు. అతను స్వప్న ని ప్రేమిస్తాడు. తన తండ్రి చనిపోవడంతో కెరీర్ మీద ఫోకస్ చేసి అనుకున్నది సాధిస్తాడు.
తర్వాత స్వప్న తండ్రి కనిపించి ఏం చేశావు అని అడిగితే…ఇంజనీరింగ్ అయిపోయిందని చెప్తాడు. నిజానికి వరుణ్ సందేశ్ ఇంటర్ లో బైపీసీ చదువుతాడు. వరుణ్ సందేశ్ కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం లో బాలు.. బైపీసీ అని రాసి ఉంటుంది.
ఆ ఉత్తరాన్ని బాలు కి తెలీకుండా స్వప్న చదువుతుంది. ఆ ఉత్తరం మీద బైపీసీ అని క్లియర్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఇంజనీర్ కంప్లీట్ చేసానని చెప్తాడు. బైపీసి చదివి ఇంజనీర్ ఎలా అవుతారు అని పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి.ఇంత బ్లండర్ ఉన్నా అప్పట్లో కొట్టుకు పోయింది. ఇప్పుడైతే అడ్డాల శ్రీకాంత్ ..అడ్డంగా ట్రోలర్స్ కి అడ్డంగా దొరికేసేవాడేమో..!
Also Read: ఆయనతో సినిమా … నో ఛాన్స్!!