ఒకప్పుడు హీరో యాభై, అరవైమంది మందిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాం. గురుత్వాకర్షణ గాలికొదిలేసి హీరోలు గాల్లో పల్టీలు కొడుతుంటే కళ్ళప్పగించి చూసాం.
Also Read: అల్లు శిరీష్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
విదేశీ వీధుల్లో హడావుడిగా పోతున్న సిటిజన్లకు మన హీరోహీరోయిన్లు వింతవింత డాన్సులతో పంటికింద రాళ్ళలా అడ్డం పడుతుంటే భరించాం. అప్పట్లో ప్రేక్షకుడి పెద్దమనసుకు ఇవన్నీ గొప్పగా అనిపించేవి.
ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ మాత్రం చూసి కంట తడిపెట్టుకుని ఇంటికి వచ్చేసే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. సినిమాలో ఏ తప్పు దొరికినా మేగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూస్తున్నారు. ఇంటర్నెట్లో ఎండ గడుతున్నారు.
వేరే సినిమా నుండి పాటలు సీన్ లు కాపీ కొట్టినా పసిగట్టేస్తున్నారు. పొరపాటున లాజిక్ లు మిస్సైతే మీమర్స్ మీసాలు తిప్పుతున్నారు. రకరకాల మీమ్స్ కు బ్రహ్మానందం బొమ్మపెట్టి ఆ సినిమా డైరెక్టర్ని ఇండైరెక్టుగా ఓఆట ఆడుకుంటున్నారు.
అలాంటి లాజిక్ మిస్సింగ్ ఒకటి.. హిట్ 2 మూవీలో పట్టారు మనోళ్ళు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా పార్ట్ 2 లో అడవిశేష్ హీరోగా నటించాడు.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైనప్పుడు ప్రేక్షకులు పెద్దగా లాజిక్ లను గమనించలేదు. కానీ ఓటీటీలో విడుదలైన తరవాత మాత్రం లాజిక్ లను వెతుకుతున్నారు.
ఈ సినిమాలో సైకో కిల్లర్ గా సుహాస్ నటించాడు. కాగా సుహాస్ సైకో కిల్లర్ అని తెలియక ముందు సుహాస్ గర్ల్ ఫ్రెండ్ కు థ్రెట్ ఉందని తన జీప్ కు ఫోటో కనిపించడంతో కేడీ(హీరో) అక్కడకు వెళతాడు. అయితే అక్కడే సుహాస్ తో పాటూ అతడి గర్ల్ ఫ్రెండ్ ఉంటారు.
దాంతో అక్కడ క్రిమినల్స్ ఎవరూలేరని కేడీ వెనక్కి వెళతాడు. అలా వెళ్లే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోనే జీప్ కు కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో సీరియల్ కిల్లర్ సుహాస్ అని తెలిసిపోతుంది. దాంతో సుహాస్ ఇంట్లోనే ఉంటే జీప్ కు కేడీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఎవరు పెట్టారబ్బా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.