భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. వరల్డ్ కప్ లో భాగంగా మౌంట్ గనుయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆమె ఆడారు. దీంతో అత్యధిక (ఆరు) వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన్న ఏకైక మహిళా క్రికెటర్ గా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.
మిథాలీ 2000 సంవత్సరంలో తొలిసారిగా వరల్డ్ కప్ లో ఆడారు. ఆ తర్వాత ఆమె 2005, 2009, 2013, 2017ల్లో జరిగిన వరల్డ్ కప్ లో ఆడి అద్భుతమైన ఆటతీరు కనబరిచారు.
ప్రపంచ కప్ ల్లో ఇంతకు ముందు ఆమె ఎన్నో రికార్డులను నెలకొల్పారు. రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓ జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన రికార్డు ఆమె పేరిటనే ఉంది.
వన్డే వరల్డ్ కప్ లో 31 మ్యాచ్ ల్లో 1139 పరుగులను ఆమె చేశారు. వన్డే వరల్డ్ కప్ లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్ గా ఆమె రికార్డుల్లో నిలిచారు. ఈ రికార్డు సృష్టించిన ఐదవ మహిళా క్రికెటర్ ఆమె కావడం గమనార్హం.