రెండు సంవత్సరాల బాలుడి కిడ్నాప్ సంఘటన హైదరాబాద్ మియాపూర్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫిజ్‌పేట్ ఆదిత్య నగర్ కు చెందిన అబ్దుల్ వాహిద్ కుమారుడు ఎం. డి. ఆష్కాన్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుండి కనిపించలేదు. బాలుడు ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలుడిని వెతికేందుకు ఐదు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించి ఒక వ్యక్తిని అనుమనించిన పోలీసులు.. మాదాపూర్ లోని కల్లు దుకాణం వద్ద బాలుడితో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.