మొద్దు వ్యవస్థపై పోరాటం - Tolivelugu

మొద్దు వ్యవస్థపై పోరాటం

, మొద్దు వ్యవస్థపై పోరాటం

 

 

 

హైదరాబాద్: 48 గంటలుగా మురికి కాలువ గుంతలోనే ఉంది ఈ మహిళ. అక్కడే తన నిరసన దీక్ష కొనసాగిస్తోంది. ఇదేదో తమిళ హీరో కత్తి సినిమా రీమేక్ మూవీ షూటింగ్ కాదు. రియల్ స్టోరీ! మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఇష్టానుసారంగా మురికి నీటి కాలువలు నిర్మిస్తున్నారని ఈ మహిళ ఎప్పటి నుంచో గొంతు చించుకుని చెబుతోంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని చెబుతూ, ప్రణాళిక బద్దంగా డ్రెయినేజ్ కాలువల్ని నిర్మించాలని అధికారులకు పదేపదే సూచించింది. వారు సహజంగానే ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుండటంతో ఇదే కాలనీకి చెందిన అరుణ ఇలా వినూత్నంగా నిరసన చేపట్టింది. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు చెప్పినా  ఎవరూ కూడా తన మాట ఖాతరు చేయడం లేదని, సమస్య మూలాల్ని అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తోంది. బిల్డర్లు ఇష్టానుసారంగా మురికి కాలువ, మ్యాన్ హోల్‌లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తోంది.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp