ప్రశ్నిస్తే తెలంగాణలో అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. విమర్శిస్తే వీధి రౌడిల్లా బెదిరిస్తున్నారు. తమపై వ్యతిరేక వార్తలు రాయడాన్ని తట్టుకోలేక ఇటీవల కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా జర్నలిస్టులకే ఫోన్ చేసి చంపేస్తామంటూ వార్నింగులు ఇచ్చి పరువు తీసుకున్న సంగతి మరువకముందే…తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఓయూలో వీరంగం సృష్టించారు.
ఒక ఛానల్ డిబేట్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మట్లాడిన ఓయూ స్టూడెంట్ లీడర్ సురేష్ యాదవ్‌పై బాల్క సుమన్ అనుచరులు దాడి చేశారు. టీఆర్ఎస్‌ని, తమ అన్న బాల్క సుమన్‌ని ఎవరైనా విమర్శిస్తే ఊరుకోమని.. చంపేస్తామంటూ బెదిరించారు. రాత్రి 11.30 గంటల సమయంలో దాదాపు 20 మంది బాల్క సుమన్ అనుచరులు.. బీరు సీసాలతో, మారణాయుధాలతో సురేష్‌పై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు.
బాధితుడు సురేష్.. ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బాల్కసుమన్ నుంచి తకు ప్రాణ హాని ఉందని.. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.