పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని మరోసారి వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకరావాలో తనకు బాగా తెలుసని, బీజేపి-కాంగ్రెస్‌లలో పని చేసిన అనుభవం తనకు పనికొస్తుందన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీయే లేదని, ఎంతటి నాయకుడైనా సోనియా, రాహుల్ అడుగుజాడల్లో నడవాల్సిందేనన్నారు.
తన రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్ నుండే ప్రారంభమైందని అంగీకరించారు జగ్గారెడ్డి.