విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో విమర్శించాడు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనే చంద్రబాబుకు సరైన బుద్ది చెప్పామని అయినప్పటికీ ఆయనకు జ్ఞానోదయం కలగలేదని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పై కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్. ఆయన కొవ్వు కరిగేలా బుద్ది చెప్పాలని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా..? అంటూ పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైల్లో వేయాలన్నాడు.