బీఆర్ఎస్ నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పక్షం ఆగడాలు శృతి మించిపోయాయన్నారు. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదని వ్యాఖ్యానించారు.
హుజూరాబాద్ లో శాంతియుత వాతావరణాన్ని అధికార పార్టీ నేతలు చెడగొట్టారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు.
ప్రజలపై దాడులు చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.
తన మండలానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్, తుమ్మ శోభన్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.