ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ కి ఫోన్ చేసినా, జిల్లా మంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదని ఆయన ఆరోపించారు. ప్రోటో కాల్ ఉల్లఘించి అవమానిస్తున్నారని, అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవన్నారు.
ఎప్పుడో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్స్ ను ఇప్పుడు ప్రారంభిస్తున్నారంటే.. ఎంత సిగ్గుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. మహిళా గవర్నర్ ను అవమానించారని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది కేసీఆర్ నినాదం.. ఇది విని ఆశ్చర్యపోయానన్నారు.
కేంద్ర పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు. హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడం లేదా? ఈ మాత్రం సోయి లేదా? అని వ్యాఖ్యానించారు.
ఒక లీటరు పెట్రోల్ కి.. రూ.41.50 రాష్ట్రానికి టాక్స్ కడితే.. రూ.19.50 కేంద్రానికి టాక్స్ కడుతున్నామని, పన్నులో ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం తిరిగి ఇస్తామన్నారు. ఇవన్నీ కేటీఆర్ కు తెలీదా? అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్.