గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ అని ప్రపంచం మొత్తం కొనియాడుతుందన్నారు. ప్రజల్లో స్ఫూర్తి నింపే రోజు జనవరి 26 అని.. తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకలను జరపకపోవడం సిగ్గుచేటన్నారు. అలాగే కేసీఆర్ గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరు దారుణమన్నారు.
గవర్నర్ ను అవమాన పరచడం, రాజ్యాంగాన్ని, తెలంగాణ మహిళలను అవమాన పరచడమే అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా సమాజం తలదించుకుందన్నారు.
తమిళిసై వచ్చాక గవర్నర్ ను అవమానిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వెళ్లగొట్టాక.. నన్ను బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. తాను పార్టీ మారాలని మారలేదని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.