హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మనం ప్రోగ్రెసివ్ మేనర్ లో ఉన్నామా? లేక రిగ్రసివ్ మేనర్ లో ఉన్నామా? అంటూ ప్రశ్నించారు.
అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్టీ అధికారి గానీ, ఎస్సీ అధికారి గానీ లేరని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఒక్క దళిత మహిళా ఎమ్మెల్యే కూడా లేరని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో 1000 మంది మధ్యలోనే చదవును వదిలేసి వెళ్లిపోతున్నారని, మరో 500 మంది చనిపోతున్నారని చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను ఈటల గుర్తు చేవారు.
అనంతరం వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణంపై కూడా ఈటల పలు వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి కారణం వేధింపులేనని అన్నారు. చనిపోయిన బిడ్డకు చికిత్స చేశారంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.