సహకార సంఘ ఎన్నికల్లో టీఆరెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు కు కుడికంటికి గాయమైంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ సహకార సంఘ ఎన్నికల్లో టీఆరెస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట, బ్యాలెట్ పత్రాల గల్లంతుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.