జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే వాఖ్యలు బండి సంజయ్ చేస్తున్నారు. బీజేపీ కేంద్రం లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ లు బండి సంజయ్ కు గుర్తున్నాయా..పేదల అకౌంట్ లలో వేస్తామన్న 15లక్షల ఏమయ్యాయి.. కనీసం తెలంగాణ లోని పేదలకైనా 15లక్షలు వచ్చాయా..రాకుంటే ప్రధాని తో మాట్లాడి బండి సంజయ్ ఇప్పించగలరా.. దీనికి ఎందుకు బండి సంజయ్ సమాధానం చెప్పట్లేదు. ఆలయాలు ,దేవుళ్ళు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్ కి గుర్తుకురావా..యూపీఏ ప్రభుత్వం లో క్రూడాయిల్ ,సిలిండర్ ల పై పది పైసలు పెంచితే బీజేపీ నానా యాగిరి చేసేది.మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది.
ఇప్పటి కేంద్ర మంత్రి స్పృతి ఇరానీ సిలిండర్ రోడ్డు పై పెట్టుకోని నిరసన చేసింది మర్చిపోయారా. దీనికి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారు.యూపిఏ ప్రభుత్వం లో 40రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు డబల్ అయింది..మరి బండి సంజయ్ ప్రధాని తో మాట్లాడి ధర తగ్గిస్తారా. యూపీఏ ప్రభుత్వం లో లీటర్ డిజిల్ 36రూపాయలు ఉంటె ఇప్పుడు 78రూపాయలు అయింది.. ఇది ప్రజలకు ఏంత పెద్ద భారమో బీజేపీ ప్రభుత్వం తెలుస్తుందా..క్రూడాయిల్ ధరల పెరుగుదల పై బండి సంజయ్ సమాధానం ఎందుకు చెప్పట్లేదు.
కాళీకామాతా భూముల గొడవ ముఖ్యమా…. క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజల ఇబ్బందులు ముఖ్యమా.. బీజేపీ నేతలు పెట్రోలు ,డిజిల్ వాడట్లేదా. పెట్రోల్ ,డిజిల్ ,సిలిండర్ ల ధర తగ్గింపుకు ముందు కేంద్రం తో మాట్లాడి… ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. ధరలు తగ్గించని పక్షంలో మేము బండి సంజయ్ కు డెడ్ లైన్ పెడతాం.. స్లో పాయిజన్ లెక్క క్రూడాయిల్ ధరలు బీజేపీ పెంచుతుంది. పున్నమినాగు సినిమా లో హీరో చిరంజీవి కి రోజు విషం ఇచ్చి.. విషపు మనిషిగా చేసినట్లు ..బీజేపీ ప్రభుత్వం తెలియకుండానే పెట్రోల్ ,డిజిల్ ,సిలిండర్ ధరలు పెంచుతుంది.