జగ్గారెడ్డి ఎమ్మెల్యే
2017 నుంచి సంగారెడ్డి నియోజవర్గంలో హరీష్ రావు పుణ్యమా అని నీటి కష్టాలు మొదలు అయ్యాయి. గడిచిన మూడేళ్ళ నుంచి సంగారెడ్డి జిల్లా ప్రజలు నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. మంజీరా-సింగూరు డ్యామ్ నీళ్లను సంగారెడ్డి జిల్లాకు చెందకుండా హరీష్ రావు చేశారు! సంగారెడ్డి జిల్లా అధికారులు ప్రజల కోసం కాకుండా హరీష్ రావు కోసం పనిచేస్తున్నారు. నారాయణ ఖేడ్- జోగిపేట్-పఠాన్ చేరు-జహీరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ టీఆరెస్ కావడంతో నీళ్ల కరువు వచ్చింది. సింగూరు డ్యామ్ కి మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తాయి…ఒక్కసారి నిండితే ఒక ఏడాది పాటు వస్తాయి. హరీష్ రావు సంగారెడ్డి కి వస్తే కలెక్టర్-పోలీసులను తప్ప ఎవరిని కలువద్దు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా! లేదంటే అడిగేవారు లేరు!
హరీష్ రావు మంత్రి కాదు నీళ్ల దొంగ సింగూరు-మంజీరా డ్యామ్ నీళ్లు నింపే కార్యాచరణ ఏమైంది? సంగారెడ్డి ప్రజల బతుకులతో చెలగాటం ఆడుతూ సిద్దిపేటకు నీళ్లు తీసుకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ రావు సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రెండు మూడు రోజుల్లో సెకండ్ ఎపిసోడ్ లో బయటపెడుతా! నేను హరీష్ రావు కు సన్మానానికి ముందు- తరువాత ఎమ్ జరిగిందో త్వరలో బయపెడుతా, సెకండ్ ఎపిసోడ్ లో కేసీఆర్ పాస్ పోర్ట్ విషయం కూడా బయటకువస్తది. నేను ఎవ్వరికి బయపడను-నా పై పెట్టాల్సిన కేసులన్ని పెట్టారు.