జగ్గారెడ్డి
నేను కూడా పీసీసీ రేసులో ఉన్నాను. రాహుల్, సోనియాగాంధీ లకు లేఖ కూడా పంపించాను. పీసీసీ మార్పు జరిగితే నాకు అవకాశం ఇవ్వండి. సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషిచేస్తా.మండల, జిల్లా స్థాయి వరకు సమయం ఇచ్చి తిరుగుతాను
అవసరం అయితే గ్రామాల్లో కూడా తిరుగుతాను నా స్టేట్మెంట్ తో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు.నా ప్రతి మాట వ్యూహాత్మకంగానే ఉంటుంది.
పీసీసీ పదవి కోసం ఢిల్లీకి వెళ్లి మాత్రం ఫైరవీ చేయలేను. నా వ్యక్తిత్వం కొందరి కి తెలియక ..నన్ను తెరాస కోవర్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గురించి ఎవరూ మాట్లాడని రోజుల్లోనే నేను విమర్శలు చేశాను. కానీ చాలామంది ఇప్పుడు ఫేస్ బుక్ లో కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు. నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుండే రాజకీయాలు మొదలుపెట్టాను. ఫేస్ బుక్ పిచ్చోళ్ళకు కొందరు లీడర్స్ పైసలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు. ఇందిరా గాంధీకి దుర్గా దేవి తో పోల్చారు వాజపేయి.
ఇందిరా గాంధీని పొగిడిన వాజపేయి తగ్గినట్టా..? ఫేస్ బుక్ లో నా మీద విమర్శలు చేస్తే మీ పేరు ఫోన్ నెంబర్ పెట్టండి. ఇంటికి వచ్చి మీ అనుమానాలకు వివరణ ఇస్తాను.