జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారు. ధరణి తో ప్రజల ఆస్తులకు కొత్తగా భద్రత వస్తుంది అని నమ్మించారు. ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను నిలదీశారు జనం. సీఎం తెలిసి చేస్తున్నాడో… తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నిజాం కాలం నుండి ఆస్తులకు భద్రత ఉంది. ఏ అధికారి ఇలాంటి సూచనలు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఐదు నెలల నుండి రిజిస్ట్రేషన్ శాఖ నిలిచి పోయింది. కరోనా కాలం లో ఆస్తులు అమ్ముకునో… బ్యాంక్ లోనో తెచ్చుకుందాం అనుకున్నా వీలు కాలేదు. అలా ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు. CS కి కరోనా వస్తే… ఆయన చేతిలో డబ్బులు లేకుంటే డబ్బులు ఎలా తెచ్చుకోవాలో ఆయనకు తెలిసేది. రిజిస్ట్రేషన్ శాఖను బంధు చేయడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో అధికారులకు తెలియదు.
జనం సమస్యలు అధికారులు చూస్తున్నారో లేదో. అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. రాష్ట్రాన్ని దివాళా తీయకండి. కోర్ట్ ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ల ఆపారు. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు కేసీఆర్.. కానీ అమలు కావడం లేదు. పాత పద్దతిలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదో సమాధానం చెప్పాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలింది. సీఎం..సీఎస్ లు తక్షణమే పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాలి.ప్రజల ఉసురు ప్రభుత్వానికి తాకుతుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు.