రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, పంతానికి పోయి రాష్ట్రాన్ని దివాళా తీయొద్దంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసలు ఇలాంటి సలహాలు ఏ అధికారి ఇస్తున్నారని, అధికారుల మాటలు విని సీఎం చెడ్డపేరు తెచ్చుకోవద్దని జగ్గారెడ్డి సలహా ఇచ్చారు.
సమస్య ముదిరితే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, ప్రజల ఆందోళనతో ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందన్నారు. రాష్ట్రంలో ఐదు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, సీఎంతో పాటు సీఎస్ లు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆదేశాలివ్వాలన్నారు.
రిజిస్ట్రేషన్లు బంద్ చేయటం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధికారులకు అర్థం కావని, అధికారులు పిచ్చి పనులు మానుకోవాలన్నారు.