సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసిన హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆరోపణలు చేశారు. కరోనా కష్ట కాలంలో రెమ్‌డెసివర్‌ను పార్థసారథి కంపెనీ అధిక ధరలకు అమ్మినట్లు విమర్శించారు.
పార్థసారథికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నానని, అన్ని వివరాలు వచ్చాక మళ్లీ స్పందిస్తానని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు. పార్థ సారథి ఎపిసోడ్ ఆపేది లేదని స్పష్టం చేశారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తానని అన్నారు.
ప్రజల సొమ్ము పార్థసారథి వద్ద ఉన్నదని, ఆయన విషయాలు చాలా ఉన్నాయని అవి త్వరలో బయటపెడతానని తెలిపారు. మూడు లేదా నాలుగు రోజుల్లో పార్థసారథికి సంబంధించిన అన్ని విషయాలను తెలుపుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ పక్క రాష్ట్రంలోని రైతులపైన ప్రేమ చూపుతూ, సొంత రాష్ట్రంలోని రైతులపైన సవతి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. రాజకీయాల కోసమే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదన్నారు.