కాంగ్రెస్‌లో పులిలా బ్రతికిన కేకే, డీఎస్‌లు పిల్లిలా మారిపోయారని విమర్శించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కూడా సొంత పార్టీ మంత్రులను నిలదీసిన. అంత స్వేచ్ఛ జాతీయ పార్టీల్లోనూ అందులోనూ కాంగ్రెస్‌లోనే ఉంటుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం, పొగిడే అవకాశం ఉంటుందని… అధికార పార్టీలో అది సాధ్యం కాదన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ కొరకు ప్రతిపాదనలు పంపిన సీఎం కేసీఆర్, మంత్రి ఈటెలకు కృతజ్ఙతలు చెప్తూనే… ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లో న్యాయం ఉంది కాబట్టే 3 రోజులు సంగారెడ్డిలో నిరసన దీక్షలో పాల్గొన్నా అన్నారు జగ్గారెడ్డి.