ప్రజా సమస్యల పై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆలయాలు ,దేవుళ్ళు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్ కి గుర్తుకురావా అని ప్రశ్నించారు.
యూపీఏ ప్రభుత్వం లో క్రూడాయిల్, సిలిండర్ ల పై పది పైసలు పెంచితే బీజేపీ నానా యాగిరి చేసేది… మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. యూపిఏ ప్రభుత్వం లో 40రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు రెట్టింపయ్యిందని, ఇవి బండి సంజయ్ ప్రధానితో మాట్లాడి తగ్గిస్తారా అని ప్రశ్నించారు.
కాళీకామాతా భూముల గొడవ ముఖ్యమా…. క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజల ఇబ్బందులు ముఖ్యమా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పున్నమినాగు సినిమా లో హీరో చిరంజీవి కి రోజు విషం ఇచ్చి.. విషపు మనిషిగా చేసినట్లు ..బీజేపీ ప్రభుత్వం తెలియకుండానే పెట్రోల్ ,డిజిల్ ,సిలిండర్ ధరలు పెంచుతుందన్నారు.