పీసీసీ చీఫ్ పై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తప్పుబట్టగా… తనకు పీసీసీ రాలేదన్న బాధతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అంగీకరించిన జగ్గారెడ్డి… కొత్త పీసీసీకి, కోమటిరెడ్డికి మధ్య గ్యాప్ ఉందన్నారు. ఆ గ్యాప్ త్వరలో పోతుందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ఏ ఆదేశం ఇచ్చినా ఫాలో అవుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెళ్లడం తప్పుకాదని అలాగని చంద్రబాబుకు సీతక్క రాఖీ కట్టడం కూడా తప్పు కాదన్నారు. పీసీసీ మీద ఎవరు కామెంట్ చేసినా సమర్దించనన్నారు.
పార్టీ మీద ఇష్టం లేకపోతే కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో ఉండలేరని, కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.