తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు నడుస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని జగ్గారెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది ఒక తప్పుడు అభిప్రాయమని,కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఐక్యత మాత్రం దెబ్బతినదని స్పష్టం చేశారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే…వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి వ్యతిరేక తీర్మానం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన చట్టం అంబానీ, ఆదానీ, అమెజాన్‌కు లాభం చేయడానికేనన్నారు. రైతు సంఘాల భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. బాంబే హైవేను దిగ్బంధం చేస్తున్నామని, తాను సంగారెడ్డిలో హైపై కూర్చుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు.