ఏపీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో ఆయన బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చేరారు.
కరణం బలరాంకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు.. అలాగే,ఆయనతో కాంటాక్ట్ అయినవారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడగా.. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా కన్ఫామ్ అయింది.