అనంపురం జిల్లా కలెక్టర్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ ఇవాళ ఉంటాడు… రేపు పోతాడన్నారు. కలెక్టర్ గురించి చెప్పాలంటే చాలా పేజీలు అవుతుందని, జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన పట్టించుకోడని… మంత్రులను వెదవలను చూసినట్లు చూస్తున్నాడన్నారు. ఆయనో పనికిమాలినోడన్నారు. కలెక్టర్ తప్పుడు సమాచారంపై ప్రభుత్వాన్ని విషయం చేరవేస్తామని… ఆయన విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.
అసలు అనంతపురం జిల్లాలో ఏం పరిపాలన జరుగుతుందో అర్థం కావటం లేదని, రేపటి నుండి ప్రజల దగ్గరకు పోవాల్సింది మేమేనన్నారు. మంత్రులు చెప్పినా వినే పరిస్థితిలో కలెక్టర్ లేరని… ఎవరూ పై నుంచి దిగిరాలేదంటూ కేతిరెడ్డి మండిపడ్డారు.