జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతోనే తెలుగుదేశం పార్టీలో మార్పు వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ .. తారక్ కు ఇచ్చిన ఆఫర్ పై ఎమ్మెల్యే కొడాలి నాని శనివారం రియాక్ట్ అయ్యారు.
అసలు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలని లోకేష్ ఆహ్వానించటం ఏంటి? తెలుగు దేశం పార్టీని స్థాపించిందే జూనియర్ ఎన్టీఆర్ తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటూ గుర్తు చేశారు. మార్పు రావాల్సింది.. రాష్ట్రంలో కాదు.. టీడీపీలో అని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ తప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ కి అధ్యక్ష పదవి ఇస్తే మార్పు వస్తుందన్నారు.
అప్పుడు తెలుగుదేశంకు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా దొరుకుంతుందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన బాగుందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ ని ఓడించడం తమ వల్లకాదని అందుకే నారా లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ ని సపోర్ట్ అడుగుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.
కాగా ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ మాజీ మంత్రులు మండిపడ్డారు. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ… క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తీ కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నాడన్నారు. సీఎం జగన్ బూట్లు నాకుతున్న కొడాలి నానికి, మతి కూడా పోయినట్లుందన్నారు. బూతులు మాట్లాడినప్పుడు, క్యాసినో డాన్సులు వేయించిన వాడికి పరువు ఉంటుందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
420 గుట్కా నానికి దమ్ముంటే బరిగీసి పిలిస్తే ఎవరు దమ్మేంటో చూసుకుందామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలీసులు లేకుంటే ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టని కొడాలి నాని, మగతనం గురించి మాట్లాడతాడా? అని ప్రశ్నించారు.